Budget: బడ్జెట్ లో ఏ శాఖకు ఎంతిచ్చారంటే..!

  • రక్షణ శాఖకు పెద్దపీట.. రూ.6.2 లక్షల కోట్ల కేటాయింపు
  • గ్రామీణాభివృద్ధికి రూ.1.77 లక్షల కోట్లు
  • రైల్వేకు రూ.2.55 లక్షల కోట్లు ప్రకటించిన కేంద్ర మంత్రి
Budget Allocations To Different Deparments

కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రక్షణ రంగానికి పెద్ద పీట వేసింది. దేశ రక్షణ విషయంలో రాజీ పడే సమస్యే లేదని ఈ కేటాయింపుల ద్వారా ఎన్డీయే సర్కారు స్పష్టం చేసింది. ప్రస్తుత మధ్యంతర బడ్జెట్ లో రక్షణ శాఖకు రూ.6.2 లక్షల కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. విమానయాన రంగంలో కొత్త విమాన సర్వీసులను తీసుకొస్తామని, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు వైమానిక సేవలను మరింతగా విస్తరిస్తామని మంత్రి చెప్పారు. ఇందుకోసం బడ్జెట్ లో ప్రత్యేకంగా కేటాయింపులు చేసినట్లు తెలిపారు. వందే భారత్ ట్రైన్లతో రైల్వేలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి చెప్పారు. మిగతా రైళ్ల బోగీలను కూడా వందేభారత్ స్థాయిలో తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

ఏ శాఖకు ఎంతంటే.. (రూ. లక్షల కోట్లలో)
ఉపరితల రవాణా, జాతీయ రహదారులకు రూ. 2.78 
రైల్వే శాఖకు రూ. 2.55
ప్రజా పంపిణీ శాఖకు రూ.2.13
హోం శాఖకు రూ. 2.03
గ్రామీణాభివృద్ది శాఖకు రూ.1.77
రసాయనాలు, ఎరువులకు రూ.1.68
కమ్యూనికేషన్ రూ.1.37
వ్యవసాయం, రైతు సంక్షేమానికి రూ.1.27

More Telugu News