Nikhil Siddhartha: తండ్రి కాబోతున్న నటుడు నిఖిల్.. భార్య సీమంతం ఫొటో పోస్ట్

Tollywood Actor Nikhil Expected First Baby Soon
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకంగా ఓ గుర్తింపు సంపాదించుకున్న నటుడు నిఖిల్ సిద్ధార్థ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించాడు. 2020లో తాను ప్రేమించిన డాక్టర్ పల్లవి వర్మ మెడలో మూడుముళ్లు వేసిన నిఖిల్ తాజాగా ఆమె సీమంతం ఫొటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. త్వరలోనే తాము తల్లిదండ్రులం కాబోతున్నామని, ఈ విషయం మీతో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉందని, మీ ఆశీస్సులు కావాలని కోరాడు. 

హ్యాపీడేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిఖిల్ ఒక్కో మెట్టు ఎక్కుతూ పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. అతడు కథానాయకుడిగా వచ్చిన కార్తికేయ-2 సినిమా రికార్డులు కొల్లగొట్టింది. అంతేకాదు, అతడిని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లింది. ప్రస్తుతం భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ‘స్వయంభూ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం వియత్నాం వెళ్లి మూడు నెలలపాటు యుద్ధ విద్యలు కూడా నేర్చుకున్నాడు. నిఖిల్ కెరియర్‌లోనే ఇది భారీ బడ్జెట్ సినిమాగా రూపొందుతోంది.
Go Back to Shorts
Nikhil Siddhartha
Tollywood
Doctor Pallavi Varma
Baby Shower

More Telugu News