నేను కోలుకుంటున్నా: క్రికెటర్ మయాంక్ అగర్వాల్

  • విమానంలో పొరబాటున హానికారక ద్రవాన్ని తాగిన మయాంక్ అగర్వాల్
  • పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలింపు
  • త్వరలోనే డిశ్చార్జి అవుతానంటూ సోషల్ మీడియాలో మయాంక్ స్పందన
అనూహ్య రీతిలో ఆసుపత్రిపాలైన భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ క్రమంగా కోలుకుంటున్నాడు. రంజీ మ్యాచ్ ఆడేందుకు విమానంలో వెళుతుండగా, తన సీటు ముందున్న ప్లాస్టిక్ కవర్ లోని ద్రవాన్ని మంచినీళ్లు అనుకుని తాగేసిన మయాంక్ అగర్వాల్ తీవ్ర అస్వస్థతకు గురికావడం తెలిసిందే. 

ప్రస్తుతం ఈ కర్ణాటక రంజీ టీమ్ కెప్టెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన ఆరోగ్యంపై మయాంక్ స్వయంగా అప్ డేట్ ఇచ్చాడు. తాను కోలుకుంటున్నానని, త్వరలోనే డిశ్చార్జి అవుతానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఇప్పుడు తన ఆరోగ్యం బాగానే ఉందని, తాను కోలుకోవాలని ప్రార్థిస్తున్నవారికి, తనపై ప్రేమాభిమానాలు ప్రదర్శిస్తున్నవారికి కృతజ్ఞతలు అంటూ తన పోస్టులో పేర్కొన్నాడు.

Mayank Agarwal
Health Update
Hospital
Karnataka
Team India
Cricket

More Telugu News