Narendra Modi: అవసరముంటేనే మొబైల్ వాడుతాను... అతి వినియోగం మంచిది కాదు: విద్యార్థులతో ప్రధాని మోదీ

  • మొబైల్ ఫోన్‌లలో స్క్రీన్ టైమ్ అలర్ట్ టూల్స్‌ను వినియోగించాలని సూచన
  • మొబైల్స్ చూస్తూ సమయాన్ని మరిచిపోవద్దన్న ప్రధాని  
  • టెక్నాలజీకి దూరం జరగవద్దు... కానీ సానుకూల ప్రభావం ఉండేలా ఉపయోగించాలని సూచన  
PM Modi shares tips for students to reduce mobile screen time

ఏదైనా అతిగా వినియోగిస్తే మంచిది కాదని... కాబట్టి విద్యార్థులు ఎప్పుడూ మొబైల్ వెంట పడకూడదని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. పరీక్ష పే చర్చ కార్యక్రమం సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అవసరం ఉంటేనే తాను మొబైల్‌ను వినియోగిస్తానన్నారు. విద్యార్థులు కూడా మొబైల్ ఫోన్లలో స్క్రీన్ టైమ్ అలర్ట్ టూల్స్‌ను ఉపయోగించాలన్నారు. సమయాన్ని గౌరవించాలని.... మొబైల్స్ చూస్తూ సమయాన్ని మరిచిపోవద్దని హితవు పలికారు. పిల్లల ఫోన్ల పాస్ వర్డ్‌ను తల్లిదండ్రులు తప్పకుండా తెలుసుకోవాలని మోదీ సూచించారు. టెక్నాలజీ నుంచి ఎప్పుడూ దూరం జరగకూడదని... అదే సమయంలో సానుకూల ప్రభావం చూపేలా మాత్రమే ఉపయోగించాలన్నారు.

పరీక్షా పే చర్చ కార్యక్రమంలో దాదాపు 2 కోట్ల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొంతమంది పాల్గొనగా... ఆన్ లైన్ ద్వారా కోట్లాది మంది వీక్షించారు.

More Telugu News