అవసరముంటేనే మొబైల్ వాడుతాను... అతి వినియోగం మంచిది కాదు: విద్యార్థులతో ప్రధాని మోదీ
- మొబైల్ ఫోన్లలో స్క్రీన్ టైమ్ అలర్ట్ టూల్స్‌ను వినియోగించాలని సూచన
- మొబైల్స్ చూస్తూ సమయాన్ని మరిచిపోవద్దన్న ప్రధాని
- టెక్నాలజీకి దూరం జరగవద్దు... కానీ సానుకూల ప్రభావం ఉండేలా ఉపయోగించాలని సూచన
పరీక్షా పే చర్చ కార్యక్రమంలో దాదాపు 2 కోట్ల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొంతమంది పాల్గొనగా... ఆన్ లైన్ ద్వారా కోట్లాది మంది వీక్షించారు.