వేదికపై తోపులాటలో జారి పడబోయిన చంద్రబాబు... మెరుపువేగంతో కదిలిన భద్రతా సిబ్బంది

రాజమండ్రి రా... కదలి రా సభలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. రాజమండ్రి రూరల్ కాతేరులో జరిగిన ఈ సభకు భారీ ఎత్తున జనాలు హాజరయ్యారు. 

కాగా, సభ ముగిసిన అనంతరం వేదికపై తోపులాట చోటుచేసుకుంది. చంద్రబాబు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి నెలకొంది. దాంతో ఆయన వేదిక అంచు వరకు వచ్చి నిలబడ్డారు. 

అప్పటికీ జనం తోసుకుంటూనే ఉండడంతో చంద్రబాబు జారి కిందపడబోయారు. మెరుపువేగంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది తమ చేతులు అడ్డుపెట్టి చంద్రబాబు కిందపడకుండా కాపాడారు. అక్కడున్న జనంపై చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయనను అక్కడ్నించి సురక్షితంగా తీసుకెళ్లారు. 

Chandrababu
Raa Kadali Raa
Rajahmundry
Security
TDP
Andhra Pradesh

More Telugu News