సూర్య జోడీగా జాన్వీ కపూర్ .. కోలీవుడ్ ఎంట్రీ!
- 'దేవర' షూటింగులో ఉన్న జాన్వీ
- కోలీవుడ్ ఎంట్రీకి సన్నాహాలు
- సూర్య హీరోగా రూపొందే పాన్ ఇండియా మూవీ
- దర్శకత్వం వహించనున్న ఓం ప్రకాశ్
ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీకి కూడా రంగం సిద్ధమవుతూ ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం ప్రకాశ్ తమిళంలో సూర్య హీరోగా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆల్రెడీ కథా చర్చలు ముగిశాయని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా జాన్వీని ఎంపిక చేయడం జరిగిపోయిందనే ఒక టాక్ కాస్త గట్టిగానే వినిపిస్తోంది.
ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసే ఆలోచన ఉండటం వలన, కథానాయికగా జాన్వీని తీసుకున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం సూర్య 'కంగువా' సినిమాకి సంబంధించిన పనులతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత ఆయన ఈ ప్రాజెక్టుతోనే సెట్స్ పైకి వెళ్లనున్నాడని అంటున్నారు. మొత్తానికి కోలీవుడ్ ఎంట్రీ కూడా గట్టిగానే ఉండేలా జాన్వీ ప్లాన్ చేసుకుందన్న మాట.