స్పెయిన్ వెళుతూ విమానంలో జకోవిచ్ ను కలిసిన తమిళనాడు సీఎం స్టాలిన్
- స్పెయిన్ లో 8 రోజుల పర్యటనకు వెళ్లిన స్టాలిన్
- విమానంలో టెన్నిస్ దిగ్గజం జకోవిచ్ తో భేటీ
- ఆకాశవీధిలో ఆశ్చర్యకర కలయిక అంటూ తమిళనాడు సీఎం ట్వీట్
జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో సెమీస్ లోనే ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా నుంచి తిరిగివస్తుండగా, విమానంలో తమిళనాడు సీఎం స్టాలిన్ తో భేటీ జరిగింది.
స్పెయిన్ పర్యటనలో భాగంగా తమిళనాడుకు పెట్టుబడులు ఆకర్షించాలన్నది సీఎం స్టాలిన్ ప్రయత్నం. స్పెయిన్ పర్యటనలో రోకా, గెస్టాంప్ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు.