Sana Javed: షోయబ్ మాలిక్ కొత్త భార్య సనా జావెద్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు

Shoaib Malik New Wife Sana Javed Trolled By Netizens
షార్ట్స్‌లో చూడండి
పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ కొత్త భార్య, నటి సనా జావెద్‌ను నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. హైదరాబాదీ టెన్సిస్ స్టార్ సానియా మీర్జాతో విడాకులు తీసుకున్న షోయబ్.. ఇటీవల సనాను నిఖా చేసుకున్నాడు. షోయబ్‌తో వివాహం తర్వాత తొలిసారి సనా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేశారు. ఓ దుస్తుల బ్రాండ్‌‌కు సంబంధించిన ఈ ఫొటోపై నెటిజన్లు ట్రోల్స్ మొదలుపెట్టారు.  

ద్వంద్వ ముఖాల మనుషులని ఒకరు, ఇకపై నీ షోలు చూడబోనని మరొకరు కామెంట్లు చేస్తే.. అన్యాయంగా ఓ ఇంట్లో నిప్పులు పోశావని ఇంకొకరు దుమ్మెత్తి పోశారు. ఒక మహిళ మరో మహిళ కుటుంబాన్ని విడదీసిందని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ వివాహం సరికాదని ఇంకో యూజర్ కామెంట్ చేస్తే, మీకోసం వేలాది తిట్లు రెడీగా ఉన్నాయని మరికొందరు యూజర్లు దుమ్మెత్తి పోశారు. ఇప్పటికే రెండు లక్షలకు పైగా లైకులు సంపాదించుకున్న ఈ పోస్టును ట్రోల్స్ వెంటాడుతున్నాయి.
Go Back to Shorts
Sana Javed
Shoaib Malik
Instagram
Trolls
Sania Mirza

More Telugu News