నేడు వైఎస్ షర్మిలతో వైఎస్ వివేకా కూతురు సునీత భేటీ
- సునీత పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు వెలువడుతున్న వేళ ఇరువురి సమావేశం
- షర్మిలతో భేటీలో కీలక నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం
- ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి షర్మిలతో భేటీ కానున్న వైఎస్ వివేకా కుమార్తె
రాజకీయంగా తాను వేయాల్సిన అడుగులపై షర్మిలతో సునీత చర్చించనున్నట్టు సమాచారం. ఈ భేటీలో సునీత కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. మరి భేటీ తర్వాత ఏదైనా ప్రకటన ఉంటుందా? లేదా? అనేది వేచిచూడాల్సి ఉంది. వివేకా హత్య కేసు నేపథ్యంలో సీఎం జగన్తో సునీతకు దూరం పెరిగింది. మరోవైపు తండ్రి హత్యపై న్యాయ పోరాటంలోనూ సునీతకు షర్మిల అండగా నిలిచిన విషయం తెలిసిందే.