Yatra-2: న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ స్క్రీన్లపై సందడి చేసిన యాత్ర-2

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ కూడా వస్తోంది. మమ్ముట్టి వైఎస్సార్ గా నటిస్తుండగా, జగన్ పాత్రలో జీవా నటిస్తున్నారు. మహీ వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. యాత్ర-2 చిత్రం ఫిబ్రవరి 8న విడుదల కానుంది. 

ఇక అసలు విషయానికొస్తే... అమెరికాలోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వద్ద యాత్ర-2 విజువల్స్ ప్రదర్శించారు. న్యూయార్క్ లో సందర్శనీయ స్థలంగా పేరుగాంచిన టైమ్స్ స్క్వేర్ లోని డిజిటల్ స్క్రీన్లపై యాత్ర-2 స్టిల్స్ ప్రదర్శించారు. దీనికి సంబంధించిన స్లైడర్ వీడియోను వైసీపీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.
Yatra-2
Times Square
New York
YSR
Biopic

More Telugu News