నా ఇంటి కూల్చివేతతోనే మొదలవ్వాలని...: రోడ్డు విస్తరణ కోసం సొంత ఇంటిని కూల్చేసిన కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
- ఎమ్మెల్యేగా గెలిచాక కామారెడ్డి రోడ్ల విస్తరణపై కాటిపల్లి దృష్టి
- రోడ్డు విస్తరణకు తన ఇల్లు అడ్డుగా వస్తుందని తెలియడంతో దగ్గరుండి కూల్చేయించిన ఎమ్మెల్యే
- నేను చేసింది గొప్ప పనో... త్యాగమో కాదన్న కాటిపల్లి వెంకటరమణారెడ్డి
- నా నుంచే మొదలయితే ప్రజలు అర్థం చేసుకుంటారన్న కాటిపల్లి
ఈ క్రమంలో అధికారులతో కలిసి దగ్గరుండి మరీ తన ఇంటిని కూల్చి వేయించారు. రోడ్డు విస్తరణకు పట్టణ ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రోడ్డు విస్తరణ కోసం ఈ రోజు తన ఇంటిని నేనే కూల్చేసుకున్నానని తెలిపారు. తాను చేసింది గొప్ప విషయమో... లేక త్యాగం చేశాననో తాను భావించడం లేదని... రాజు ప్రజలకు అండగా ఉండాలని... అందుకే ఓ ఎమ్మెల్యేగా రోడ్డు విస్తరణ కోసం తన ఇంటినే కూల్చేస్తే ప్రజలకు ఆదర్శంగా నిలిచినట్లవుతుందని... ప్రజలు అర్థం చేసుకుంటారని భావించానన్నారు. ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం తనకు లేదన్నారు. తమ ఇంటి నుంచే మార్పు మొదలు కావాలని తన ఇంటిని కూల్చివేయించినట్లు చెప్పారు.