ఆస్ట్రేలియా బీచ్లో మునిగి నలుగురు భారతీయుల మృతి
- విక్టోరియాలోని ఫిలిప్ ఐలాండ్ బీచ్లో ఘటన
- మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ పురుషుడు
- సంతాపం తెలిపిన భారత హైకమిషన్
- అవసరమైన సాయం అందిస్తామని వెల్లడి
బాధితుల స్నేహితులను సంప్రదించి అవసరమైన సాయం అందిస్తామని చెబుతూ వారి కుటుంబాలకు సానుభూతి తెలిపింది. జనవరి 24న మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ముగ్గురు మహిళలు, ఓ పురుషుడు బీచ్లో ప్రమాదంలో ఉన్నట్టు తమకు సమాచారం అందినట్టు విక్టోరియా పోలీసులు తెలిపారు.
వెంటనే అక్కడికి చేరుకుని వారిని రక్షించే ప్రయత్నం చేశామని, అయితే అప్పటికే ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు ప్రాణాలు కోల్పోయారని, అపస్మారకస్థితిలో ఉన్న మరో మహిళను ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. అక్కడామె చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలిపారు. వీరి మృతి వెనక ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు లేవని, దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.