కామాఖ్య దేవిని దర్శించుకున్న నటి తమన్నా.. ఫొటోలు ఇవిగో!
- కుటుంబ సభ్యులతో కలిసి గువాహటిలోని కామాఖ్య ఆలయం సందర్శన
- ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫొటోలను షేర్ చేసిన మిల్కీ బ్యూటీ
- ‘నా ప్రియమైనవారితో పవిత్రమైన క్షణాలు’ అంటూ క్యాప్షన్ ఇచ్చిన నటి
కాగా తమన్నా ప్రస్తుతం అరుణ్ గోపీ దర్శకత్వంలో ‘బాంద్రా’ అనే ఓ మలయాళ సినిమాలో నటిస్తోంది. యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ద్వారా తమన్నా మలయాళ సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేస్తోంది. ఈ మూవీలో దిలీప్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా డినో మోరియా, మమతా మోహన్‌దాస్, కళాభవన్ షాజోన్, ఆర్ శరత్‌కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక తమిళ హారర్ కామెడీ సినిమా ‘అరణ్మనై- 4, నిక్కిల్ అద్వానీ దర్శకత్వం వహిస్తున్న ‘వేదా’లో కూడా నటిస్తోంది. ‘స్ట్రీట్- 2’ మూవీలో కూడా ఆమె ప్రత్యేక పాత్రలో కనిపించనుంది.
వీడియో, ఫొటోల కోసం క్లిక్ చేయండి.