దేనికైనా టైమ్ రావాలి: 'జబర్దస్త్' రాజమౌళి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దేనికైనా టైమ్ రావాలి: 'జబర్దస్త్' రాజమౌళి!

Jabardasth Rajamouli Interview
  • 'జబర్దస్త్'తో పాప్యులర్ అయిన రాజమౌళి 
  • సినిమాల్లో ఛాన్సులు వస్తున్నాయని వెల్లడి
  • డేట్స్ కుదరక ఇబ్బందులు పడ్డానని వివరణ   
  • అందువల్లనే కామెడీ షోకి దూరమయ్యానని వ్యాఖ్య
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్ లో రాజమౌళి ఒకరు. తాగుబోతు మాటలకు .. తాగుబోతు పాటలకు ఆయన ఫేమస్. తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను పంచుకున్నాడు. 'జబర్దస్త్' షో వలన నాకు ఇంతటి గుర్తింపు వచ్చింది. నాగబాబు గారు నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు" అని అన్నాడు. 

'జబర్దస్త్' షో నిర్వాహకులతో నాకు మంచి అనుబంధం ఉంది. సినిమాల్లో బిజీ కావాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు వరుసగా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. 'జబర్దస్త్' షోకి సంబంధించిన డేట్స్ క్లాష్ అవుతూ ఉండటంతో, నేను మానేయవలసి వచ్చింది. అంతకుమించి మరో కారణం లేదు" అని చెప్పాడు. 

" నాతో పాటు చేసినవాళ్లు కొంతమంది సినిమాల్లో ఆల్రెడీ బిజీ అయ్యారు. కొంతమంది అవకాశాలను వెతుక్కుంటూ వెళతారు. కొంతమంది అవకాశం వస్తే చేద్దాంలే అనుకుంటారు. నాకు చొచ్చుకుపోయే స్వభావం లేకపోవడం వలన ఆలస్యమైందని నేను భావిస్తున్నాను. ఇక డేట్స్ క్లాష్ కావడం వలన నేను వదులుకున్న సినిమాలు కూడా చాలానే ఉన్నాయి .. దేనికైనా టైమ్ రావాలంతే" అని అన్నాడు.
Advertisement
Jabardasth Rajamouli
Actor
Interview

More Telugu News