Komatireddy Venkat Reddy: కారు సర్వీసింగ్‌కు కాదు... స్క్రాప్‌కు వెళ్లింది: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • కారు షెడ్డుకు కాదు.. సర్వీసింగ్‌కు కాదు.. స్క్రాప్ కింద పోయిందని ఎద్దేవా
  • దొంగలు దొంగలు కలిసి దానిని అమ్ముకున్నారన్న మంత్రి
  • కారు లేదు.. పార్టీ లేదు.. బీఆర్ఎస్ అనే పార్టీయే లేదన్న కోమటిరెడ్డి
Komatireddy Venkat Reddy says there is no brs in telangana

కారు సర్వీసింగ్‌కు మాత్రమే పోయిందని... షెడ్డుకు పోలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెబుతున్నారని. కానీ కారు స్క్రాప్‌కు వెళ్లిందని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం ఆయన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత పదేళ్ల పాలనకు... ప్రస్తుత 48 రోజుల కాంగ్రెస్ పాలనకు తేడాను గుర్తించాలన్నారు. ఇప్పటికే ఆలేరుకు రూ.100 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. ఈ ప్రాంతానికి తాగునీరు వచ్చేలా కృషి చేస్తామన్నారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని... కానీ ఎంప్లాయిమెంట్ దిశగా ముందుకు సాగుతామన్నారు.

కోమటిరెడ్డి తన కారు ఎక్కుతున్న సమయంలో మీడియా అతనిని కేటీఆర్ వ్యాఖ్యలపై ప్రశ్నించింది. మంత్రి స్పందిస్తూ... కారు సర్వీసింగ్‌కు పోయింది కానీ షెడ్డుకు పోలేదని కేటీఆర్ చెబుతున్నాడు... కానీ షెడ్డుకు కాదు.. సర్వీసింగ్‌కు కాదు స్క్రాప్ కింద పోయిందని ఎద్దేవా చేశారు. దొంగలు దొంగలు కలిసి దానిని అమ్ముకున్నారన్నారు. కారు లేదు.. పార్టీ లేదు.. బీఆర్ఎస్ అనే పార్టీయే లేదన్నారు.

More Telugu News