50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- రానున్న రోజుల్లో వైసీపీ ఖాళీ అవుతుందన్న బుచ్చయ్య చౌదరి
- గంటా రాజీనామాపై మూడేళ్లుగా ఏం చేశారని ప్రశ్న
- అన్ని వ్యవస్థలను జగన్ ధ్వంసం చేశారని విమర్శ
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని గోరంట్ల విమర్శించారు. ఎక్కడ చూసినా అవినీతే కనపడుతోందని... చివరకు అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పేరుతో కూడా దోచుకున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ అవినీతిని బట్టబయలు చేస్తామని చెప్పారు. జగన్ పాలనలో దళితులు, బీసీలు, బలహీనవర్గాలపై దాడులు జరిగాయని అన్నారు.