తమకు న్యాయం చేయమంటూ.. రేవంత్ ఇంటికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ఆర్టీసీ ఉద్యోగులు

  • గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందన్న ఆర్టీసీ ఉద్యోగులు
  • చిన్ని కారణాలతో 1,500 మంది ఉద్యోగులను తొలగించారని ఆవేదన
  • తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని విన్నపం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఆయన నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ ఉద్యోగులు వచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వీరు తరలి వచ్చారు. గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని... తమ గోడును ముఖ్యమంత్రికి చెప్పుకునేందుకు వచ్చామని ఈ సందర్భంగా వారు తెలిపారు. చిన్నిచిన్ని కారణాలతో దాదాపు 1,500 మందిని ఉద్యోగాల నుంచి తీసేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమను విధుల్లోకి తీసుకోవాలని వారు కోరారు. రేవంత్ ఇంటి వద్ద వారిని అడ్డుకున్న పోలీసులు... సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ముగ్గురికి అనుమతిని ఇచ్చారు.


More Telugu News

Revanth Reddy Congress TSRTC Employees Telangana