అధ్యక్ష ఎన్నికల రేసులో డొనాల్డ్ ట్రంప్‌కు కీలక విజయం.. నిక్కీ హేలీకి ఎదురుదెబ్బ
- న్యూ హాంప్‌షైర్ ప్రైమరీలో గెలిచిన డొనాల్డ్ ట్రంప్
- రిపబ్లికన్ నామినేషన్ రేసులో ఏకైక పోటీదారుగా భావించిన నిక్కీ హేలీకి ఓటమి
- ఫలితాన్ని బట్టి రేసు నుంచి నిష్ర్కమించనున్న హేలీ
కాగా అధ్యక్షుడు జో బైడెన్‌ను ట్రంప్ మాత్రమే ఓడించగలరని రిపబ్లికన్లు భావిస్తున్నారు. అందుకే ఆయనకు మద్ధతు ఇస్తున్నారు. నిక్కీ హేలీ కూడా గతంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అధ్యక్ష ఎన్నికల రేసులో తాను చాలా దూరంలో ఉన్నానని అన్నారు. అయితే న్యూ హాంప్‌షైర్ ప్రైమరీలో ఓటు అనుకూలంగా పడుతుందని ఆమె భావించారు. కానీ ప్రాథమిక సమాచారం ప్రకారం నిక్కీ హేలీ ఓటమి అంచున నిలిచారు. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్రంప్‌పై రెండుసార్లు అభిశంసన తీర్మానాలు, ఆయనపై నాలుగు క్రిమినల్ కేసులు విచారణలో ఉన్నప్పటికీ రిపబ్లికన్లు ఆయనవైపే మొగ్గు చూపుతున్నారు.