కేసీఆర్ కుటుంబం తర్వాత జైలుకు పోయే వ్యక్తి జగదీశ్ రెడ్డి: మంత్రి కోమటిరెడ్డి
- ఎన్ని గిమ్మిక్కులు చేసినా విజిలెన్స్, సిట్టింగ్ జడ్జితో విచారణను అడ్డుకోలేరన్న కోమటిరెడ్డి
- పారాగాన్ స్లిప్పర్లు వేసుకొని తిరిగే వ్యక్తికి వేలకోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? అని ప్రశ్న
- నిత్యం ప్రజల్లో ఉండే తనపై ఆరోపణలు చేయడం విడ్డూరమన్న కోమటిరెడ్డి
పారాగాన్ స్లిప్పర్లు వేసుకొని తిరిగే వ్యక్తికి వేలకోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? అని ప్రశ్నించారు. అన్ని ఫామ్ హౌస్‌లు ఎలా వచ్చాయి? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు వీటి గురించి సమాధానం చెప్పవలసిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ కుటుంబంలో బావాబావమరుదులు తన్నుకుంటుంటే విషయం బయటకు పొక్కకుండా కేసీఆర్ జాగ్రత్తలు తీసుకునే సమయంలో జగదీశ్ రెడ్డి బ్రోకర్‌లా వ్యవహరించారని ఆరోపించారు. ఇలాంటి చిల్లర వ్యక్తి... నిత్యం ప్రజల్లో ఉండే తనపై ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు.