అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత తొలిసారి స్పందించిన శిల్పి అరుణ్ యోగిరాజ్
- ప్రస్తుతం ఈ భూమిపై తానే అత్యంత అదృష్టవంతుడినన్న శిల్పి
- అంతా కల మాదిరిగా అనిపిస్తోందని వ్యాఖ్య
- పూర్వీకులు, శ్రీరాముడి ఆశీర్వాదాలు ఎల్పప్పుడూ ఉంటాయని ఆనందం వ్యక్తం చేసిన అరుణ్ యోగిరాజ్
కాగా కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ గతంలో ఎన్నో దేవాలయాల కోసం ఎన్నో విగ్రహాలను రూపొందించినప్పటికీ రామ్ లల్లా విగ్రహం కోసం యావత్ దేశం ఎదురుచూసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అందరూ వేయి కళ్లతో ఎదురుచూశారు. దీంతో ఇలాంటి అనుభూతి ఎప్పుడూ పొందలేదని యోగిరాజ్ చెప్పాడు. కాగా నల్లరాతితో యోగిరాజ్ రూపొందించిన ఈ 51 అంగుళాల విగ్రహాన్ని అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించిన విషయం తెలిసిందే. రామ్ లల్లా విగ్రహాన్ని గత వారమే ఆలయం గర్భ గుడిలో పెట్టినప్పటికీ ఈ రోజే పూర్తి రూపం దర్శనమిచ్చింది. కాగా అరుణ్ యోగిరాజ్ తన కుటుంబంలో ఐదవ తరం శిల్పి కావడం విశేషం.