ప్రాణప్రతిష్ఠ సుముహూర్తం 84 సెకండ్లే..!
- అభిజిత్ ముహుర్తంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ
- మధ్యాహ్నం 12:29 గంటల నుంచి 12:30 మధ్య కార్యక్రమం
- ఉదయం 10:25 గంటలకు అయోధ్యకు ప్రధాని మోదీ
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో 150 మంది సాధువులు, మత గురువులు, 50 మంది ఆదివాసీ తెగలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారు. వీరితో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, కరసేవకుల కుటుంబ సభ్యులు సహా ఆహ్వానం అందుకున్న 7 వేల మంది అతిథులు అయోధ్య చేరుకున్నారు. కాగా, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయ్యాక అతిథులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఆపై సీఎం యోగి, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చీఫ్ మహంత్ గోపాల్ దాస్ కూడా ప్రసంగిస్తారు.