Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బంజారాహిల్స్‌ హోటల్ లో అగ్ని ప్రమాదం

Fire accident in Banjara Hills
Advertisement
  • రోడ్డు నెంబర్ 4లోని హోటల్లో చెలరేగిన మంటలు
  • పార్కింగ్‌లోని మూడు కార్లు కాలి బూడిద
  • మంటలను ఆర్పేసిన అగ్నిమాపక సిబ్బంది
Advertisement
బంజారాహిల్స్‌లో శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు నెంబర్ 4లోని ఓ హోటల్లో మంటలు చెలరేగాయి. పార్కింగ్‌లోని మూడు కార్లకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ కార్లు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. 

గుంటూరులో అగ్ని ప్రమాదం

గుంటూరు జిల్లా  దుగ్గిరాలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శుభం మహేశ్వరి శీతల గిడ్డంగిలో మంటలు చెలరేగడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిశాయి. పెద్ద మొత్తంలో పసుపు బస్తాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. తనకు కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగిందని యజమాని కన్నీరుమున్నీరు అయ్యారు.
Advertisement
Advertisement
Banjara Hills
Hyderabad
Fire Accident
Crime News

More Telugu News