Telangana: తెలంగాణలో నేటి నుంచి పలు రైళ్లకు అదనపు హాల్టులు

Additional halts for many trains in Telangana from today
షార్ట్స్‌లో చూడండి
రైల్వే శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. శనివారం (నేడు) నుంచి ప్రయోగాత్మకంగా ఆరు నెలలపాటు తెలంగాణలో పలు రైళ్లకు అదనపు హాల్టులు ఇస్తున్నట్టు  తెలిపింది. ఈ నిర్ణయం 20వ తేదీ నుంచి ఆచరణలోకి వస్తుందని, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ల నుంచి బయల్దేరి రాష్ట్రం మీదుగా రాకపోకలు సాగించే రైళ్లకు ఈ హాల్టులు ఉంటాయని స్పష్టం చేసింది. 

నారాయణాద్రి విశాఖ ఎక్స్‌ప్రెస్‌, చెన్నై సెంట్రల్‌-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌లు మిర్యాలగూడలో ఆగనున్నాయని రైల్వే శాఖ తెలిపింది. ఇక నర్సాపూర్‌, విశాఖ, చెన్నై సెంట్రల్‌-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌లు నల్గొండలో, నాగర్‌సోల్‌-నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ మిర్యాలగూడలో ఆగుతాయి. దక్షిణ ఎక్స్‌ప్రెస్‌ జమ్మికుంట స్టేషన్‌లో, హజ్రత్‌ నిజాముద్దీన్‌ గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ వరంగల్‌, పెద్దపల్లి స్టేషన్లలో అదనంగా ఆగనున్నాయని వివరించింది. 

మరోవైపు నర్సాపూర్‌-నాగర్‌సోల్‌ ఎక్స్‌ప్రెస్‌ నల్గొండలో ఆగుతుందని తెలిపింది. హైదరాబాద్‌-వాస్కోడగామా ఎక్స్‌ప్రెస్‌ గద్వాలలో, అంబేడ్కర్‌నగర్‌-యశ్వంత్‌పూర్‌, నాగర్‌సోల్‌-చెన్సై సెంట్రల్‌, గోరఖ్‌పూర్‌-యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ మహబూబ్‌నగర్‌లో అదనంగా ఆగుతాయని పేర్కొంది. యశ్వంత్‌పూర్‌-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ షాద్‌నగర్‌, జడ్చర్ల స్టేషన్లలో, సికింద్రాబాద్‌-రాయ్‌పూర్‌, సికింద్రాబాద్‌-రాయ్‌పూర్‌ హిస్సార్‌, హైదరాబాద్‌-రాక్సల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పెద్దపల్లిలో, సికింద్రాబాద్‌-బీదర్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ మర్పల్లి స్టేషన్‌లో ఆగనున్నాయని వివరించింది.
Go Back to Shorts
Telangana
Indian Railways
Trains Services

More Telugu News