Vishnu Kumar Raju: రాష్ట్రాలన్నీ ఈ నెల 22న సెలవు ప్రకటించాయి... ఒక్క ఏపీ తప్ప!: విష్ణుకుమార్ రాజు

Vishnu Kumar Raju said all states announce holiday except AP
షార్ట్స్‌లో చూడండి
ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు విశాఖలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 22న అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా, ఆ రోజున రాష్ట్రాలన్నీ సెలవు ప్రకటించాయని తెలిపారు. కానీ, ఏపీ ప్రభుత్వం మాత్రం సెలవు ప్రకటించలేదని అన్నారు. దేశమంతా అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమ వేడుకలు చేసుకుంటుంటే, ఏపీ ప్రభుత్వ వైఖరి బాధాకరమని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. ఏపీలో దొంగ ఓట్ల అంశంపై ఎన్నికల సంఘానికి వినతిపత్రం సమర్పించామని, వచ్చే ఎన్నికల్లో తిరుపతి తరహా కుట్రకు జగన్ సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీ నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకుపోయే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు.
Go Back to Shorts
Vishnu Kumar Raju
Ayodhya Ram Mandir
Inauguration
Holiday
Andhra Pradesh
BJP
YSRCP

More Telugu News