నువ్వు మామూలు హౌస్ వైఫ్ కాదు .. డేంజరస్ హౌస్ వైఫ్: 'భామా కలాపం 2' గ్లింప్స్ రిలీజ్
- ప్రియమణి ప్రధానమైన పాత్రగా 'భామాకలాపం'
- మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా సాగే కథ
- సీక్వెల్ గా వస్తున్న 'భామాకలాపం 2'
- ఆకట్టుకుంటున్న గ్లింప్స్
ఆ హత్య కేసు నుంచి బయటపడటానికి అనుపమ ఏం చేస్తుంది? ఆమెకి పనిమనిషి శిల్ప (శరణ్య ప్రదీప్) ఎలా సహకరిస్తుంది? ఆ హత్య కేసును పోలీస్ ఆఫీసర్ పల్లవి (శాంతి) ఎలా డీల్ చేస్తుంది? అనే ఆసక్తికరమైన అంశాలతో నడిచిన ఈ సినిమాకి విశేషమైన ఆదరణ లభించింది. అప్పటి నుంచి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఆడియన్స్ ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ల ముచ్చట తీర్చడానికి 'భామా కలాపం 2' రెడీ అవుతోంది.
కొంతసేపటి క్రితం ఈ సీక్వెల్ నుంచి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. అనుపమ - శిల్ప ఇద్దరూ కలిసి 50 లక్షల కోసం బయల్దేరడం ప్రధానంగా ఈ గ్లింప్స్ ను కట్ చేశారు. 'నువ్వు మామూలు హౌస్ వైఫ్ కాదక్కా .. డేంజరస్ హౌస్ వైఫ్' అంటూ శరణ్య ప్రదీప్ చెప్పే డైలాగ్ హైలైట్. సుధీర్ - బాపినీడు నిర్మించిన ఈ సినిమాకి అభిమన్యు దర్శకత్వం వహించాడు.