గాల్వాన్ వ్యాలీ ఘర్షణ తర్వాత ఎల్ఏసీ వెంబడి మరో రెండుసార్లు ఘర్షణపడ్డ భారత్, చైనా బలగాలు!
- ఆర్మీ వెస్ట్రన్ కమాండ్ ‘శౌర్య పురస్కారాల ప్రదానం’ కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చిన ఘర్షణ
- ఎల్ఏసీ వెంబడి చైనా బలగాల దూకుడుని అడ్డుకున్న సైనికులకు పురస్కారాలు
- యూట్యూబ్లో వీడియోను షేర్ చేసి.. తర్వాత డిలీట్ చేసిన ఆర్మీ
హర్యానాలోని చండీమందిర్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్మీ వెస్ట్రన్ కమాండ్ శౌర్య పురస్కారాల అందజేత కార్యక్రమానికి సంబంధించిన వీడియోను కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేసింది. అయితే తర్వాత ఈ వీడియోను డిలీట్ చేసింది. జనవరి 13న వీడియోను అప్లోడ్ చేసి 15న తొలగించింది. అయితే ఈ ఘర్షణలపై భారత సైన్యం స్పందించలేదు. కాగా జూన్ 2020లో గాల్వాన్ లోయ ఘర్షణతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సరిహద్దు వెంబడి ఘర్షణపూర్వక వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.