ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితురాలైన షర్మిలకు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
- వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు కోసం దావోస్లో ఉన్న రేవంత్ రెడ్డి
- షర్మిలకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్
- ఈ రోజే ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల
ఏపీసీసీ అధ్యక్షురాలిగా షర్మిలను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మంగళవారం ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజును సీడబ్ల్యుసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. షర్మిలకు పగ్గాలు అప్పగిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు.