ఏపీలో అంగన్‌వాడీలకు వేతనాలు పెంచేందుకు నిరాకరణ.. ఆరోసారీ చర్చలు విఫలం
- ప్రభుత్వంతో నాలుగు గంటలపాటు చర్చలు
- వేతనాల పెంపు విషయంలో పట్టు వీడని అంగన్‌వాడీలు
- జులైలోనే పెంచుతామని స్పష్టం చేసిన మంత్రుల కమిటీ
- ఎస్మా నోటీసు గడువు ముగియగానే తొలగిస్తామని హెచ్చరించిన ప్రభుత్వం
వేతనపెంపుపై సంక్రాంతిలోపు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకుంటే మాత్రం నిరవధిక దీక్షలకు దిగుతామని అంగన్‌వాడీలు హెచ్చరించారు. నేటి నుంచి ‘జగనన్నకు చెబుదాం’ పేరుతో ప్రతి ఇంటికి వెళ్లి కోటిమంది సంతకాలు సేకరిస్తామని, ఎస్మా జీవో పత్రాలను భోగి మంటల్లో వేసి తగలేస్తామని అంగన్వాడీ ప్రతినిధులు తెలిపారు.