రామమందిర ప్రాణప్రతిష్ఠకు నాకు ఆహ్వానం అందలేదు: అఖిలేశ్ యాదవ్
- తనకు కొరియర్ ద్వారా ఆహ్వానం పంపిస్తే ఆధారాలు చూపించాలని అఖిలేశ్ యాదవ్ డిమాండ్
- పంపినా తన చిరునామాకే పంపించారా? అన్న అఖిలేశ్
- ఆహ్వానితుల జాబితాలో అఖిలేశ్ యాదవ్ పేరు ఉందన్న విహెచ్‌పి
ఆహ్వానితుల జాబితాలో అఖిలేశ్ పేరు ఉంది: విహెచ్‌పి
శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ వేడుకకు అఖిలేశ్ యాదవ్‌ను ఆహ్వానించారా? అని విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్‌ను మీడియా ప్రశ్నించింది. ఆయనకు ఆహ్వానం అందిందో లేదో తాను ఎలా ధ్రువీకరించనని... ఆహ్వానితుల జాబితాలో మాత్రం అఖిలేశ్ పేరు ఉందని స్పష్టం చేశారు.