01 Fri 15:20 ఐఏఎస్ భన్వర్‌లాల్‌తో వివాదం... ఐపీఎస్ నవీన్ కుమార్ తనయుడిని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు సాహిత్‌ను జూబ్లీహిల్స్‌లోని ప్రకాశ్ నగర్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు నవీన్ కుమార్ అన్న, వదినలను ఇదివరకే అరెస్ట్ చేసిన పోలీసులు కొన్నాళ్లుగా బన్వర్ లాల్, నవీన్ కుమార్ మధ్య వివాదం
02 Fri 13:53 హైదరాబాద్‌లో మద్యం మత్తులో బీభత్సం.. నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు నటుడు ధర్మ ఇంటి ప్రహరీ గోడను ఢీకొట్టిన కారు మద్యం మత్తులో యువకులు డ్రైవింగ్ చేసినట్టు పోలీసుల అనుమానం జనగామలో ఆర్టీసీ బస్సును దొంగిలించిన వెంకన్న అనే వ్యక్తి తిరుపతి వెళ్లేందుకు రైళ్లు లేకపోవడంతో బస్సుతో పరారీ టోల్‌గేట్ వద్ద పట్టుకున్న పోలీసులు
03 Fri 13:43 అమరావతికి 'శాంసంగ్ సిటీ'.. కొరియా కంపెనీలతో మంత్రి లోకేశ్ కీలక భేటీలు దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేశ్ ఏపీలో బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటుకు డెల్టా ఎక్స్‌కు ఆహ్వానం త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటామన్న డెల్టా ఎక్స్ సీఈవో అమరావతిలో 'శాంసంగ్ సిటీ'కి లోకేశ్ ప్రతిపాదన ప్రతిపాదనలను ఉన్నతస్థాయి బృందంతో చర్చిస్తామన్న శాంసంగ్ ప్రతినిధులు
04 Fri 13:33 హనుమాన్‌గఢి మెట్లపై నమాజ్ చేయించినవారే ఇప్పుడు మాట్లాడుతున్నారు: యోగి ఆదిత్యనాథ్ విరాళాల చోరీ వివాదం కొనసాగుతున్న వేళ యోగి సంచలన వ్యాఖ్యలు ‘జామా మసీదులో హనుమాన్ చాలీసా చదవనిస్తారా?’ అని ప్రశ్నించిన యూపీ సీఎం అయోధ్యలో రూ.432 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభం, శంకుస్థాపన చేసిన యోగి భదర్సా పేరును ‘భారత్‌పూర్-భరత్‌కుండ్’గా మారుస్తామని ప్రకటన అయోధ్యను ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక, పర్యాటక నగరంగా తీర్చిదిద్దామని వ్యాఖ్య
05 Fri 13:31 రష్యా చమురు క్షేత్రాలపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి.. తీవ్ర ఇంధన సంక్షోభం! ఉక్రెయిన్ దాడుల్లో రష్యాలోని ఆరు చమురు డిపోలు ధ్వంసం రష్యాలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఇంధన కొరత 73 ఉక్రేనియన్ డ్రోన్లను కూల్చేశామన్న రష్యా 72 ఉక్రెయిన్ డ్రోన్లను అడ్డుకున్నామన్న ఉక్రెయిన్
06 Fri 13:28 ఇంకో కారు కొనడానికి ముద్దు సీన్లలో నటించాలా?: వ్యక్తిగత విలువలపై సాయి పల్లవి వ్యాఖ్యలు ముద్దులు, ఇంటిమేట్ సీన్లపై సాయి పల్లవి కీలక వ్యాఖ్యలు ముద్దు సీన్లు చేయమని ఎంతో మంది దర్శకులు అడిగారన్న సాయి పల్లవి అలాంటి సన్నివేశాల్లో నటించడం తనకు ఇష్టం ఉండదని వెల్లడి కథ పరంగా అలాంటి సీన్లు అవసరమైతే వేరే హీరోయిన్లను చూసుకోమని చెబుతానని వెల్లడి
07 Fri 13:23 కోడలికి కన్యాదానం చేసిన మామ.. మానవత్వానికి నిలువుటద్దంగా నిలిచిన ఘటన కొడుకు క్యాన్సర్‌తో మరణించడంతో కోడలికి రెండో పెళ్లి కన్నతండ్రి స్థానంలో నిలబడి కన్యాదానం చేసిన మామ దినేష్ వైరాగి భోపాల్‌లో జరిగిన ఈ ఘటనకు సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ ఇలాంటి నిర్ణయాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయని ఆశాభావం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు
08 Fri 13:17 బిజినెస్ క్లాస్‌లో కూర్చుని ఏడ్చేశాడు.. కారణం తెలిస్తే మనసు కదలాల్సిందే విమాన ప్రయాణంలో భావోద్వేగానికి గురైన భారత సంతతి యువ పారిశ్రామికవేత్త బిజినెస్ క్లాస్‌లో కూర్చొని చిన్నప్పుడు కన్న కలలు గుర్తొచ్చాయని వెల్లడి తన ప్రయాణాన్ని ఇన్‌స్టాలో వీడియోగా పంచుకున్న వ్యాపారవేత్త అష్ లాంబా చిన్ననాటి అనుభవాలే జీవిత లక్ష్యాలుగా మారాయని వ్యాఖ్య కలలు మారినా వాటిని సాధించాలనే తపన మాత్రం ఇప్పటికీ అలాగే ఉందన్న అష్
09 Fri 13:02 'లెనిన్' రెస్పాన్స్ చూడటానికి.. థియేటర్‌కు వెళ్లిన అఖిల్ అర్ధాంగి జైనబ్ రవ్‌జీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అక్కినేని అఖిల్ 'లెనిన్' చిత్రం రెస్పాన్స్ చూసేందుకు శ్రీరాములు థియేటర్‌కు వెళ్లిన అఖిల్ అర్ధాంగి ప్రేక్షకుల స్పందనపై సంతోషం వ్యక్తం చేసిన జైనబ్ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణ
10 Fri 13:00 అంతరిక్షంలోకి ‘వజ్ర కమలం’.. విక్రమ్-1తో చరిత్ర సృష్టించనున్న భారత్ స్కైరూట్ విక్రమ్-1 రాకెట్‌తో అంతరిక్షంలోకి వజ్ర కమలాన్ని పంపనున్న భారత్ బెంగళూరులో తయారైన ల్యాబ్-గ్రోన్ డైమండ్ కళాఖండానికి ఈ అరుదైన అవకాశం భారత సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా కమలాన్ని ఎంపిక చేసిన కాస్మోస్ డైమండ్స్ రాకెట్ ప్రయోగాన్ని తట్టుకునేలా ప్రత్యేక బలం, వైబ్రేషన్ పరీక్షలు నిర్వహించిన సంస్థ భారత కళాత్మకత, సాంకేతికతను ప్రపంచానికి చాటే ప్రయత్నంగా కంపెనీ వ్యాఖ్య