అమెరికా మిలటరీ బేస్‌పై ఎగిరే పళ్లెం.. వైరల్ వీడియో ఇదిగో!
- వీడియోను షేర్ చేసిన ఫిల్మ్‌మేకర్ జెరేమీ కార్బెల్
- జెల్లీఫిష్ ఆకారంలో మిలటరీ బేస్‌పై ఎగురుతూ కనిపించిన యూఎఫ్‌వో
- 2018లో అమెరికా సైనికులు రికార్డు చేశారన్న కార్బెల్
- ఓ సరస్సులో మునిగి 17 నిమిషాల తర్వాత తిరిగి ఆకాశంలోకి
- భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
వారంలోనే మరో వీడియో
ఈ వీడియోను షేర్ చేసిన కార్బెల్ దీనిని చొరబాటుగా అభివర్ణించారు. నెటిజన్లు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇది 2018లో జరిగిందని, అక్కడి సైనిక సిబ్బంది దీనిని రికార్డు చేశారని చెబుతున్నారు. మియామీలో ఓ మాల్ వెలుపల 10 అడుగుల గ్రహాంతరవాసి కనిపించినట్టు వైరల్ అయిన వీడియోపై పోలీసులు స్పందించిన వారంలోనే ఇప్పుడీ వీడియో వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది.
తాజా వీడియో విషయానికి వస్తే ఆ యూఎఫ్‌వో ఓ సరస్సులో మునిగి 17 నిమిషాల తర్వాత 45 డిగ్రీల కోణంతో తిరిగి పైకి లేచి వేగంగా ఆకాశంవైపు దూసుకెళ్లనట్టు కార్బెల్ పేర్కొన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు రెండుగా విడిపోయారు. కొందరు అది ఫ్లైయింగ్ సాసరేనన్న వాదనతో ఏకీభవిస్తే, మరికొందరు మాత్రం అదంతా ఒట్టిదేనని కొట్టిపడేస్తున్నారు. అది కెమెరా లెన్స్‌పై పడిన మరక తప్ప మరోటి కాదని, తమను ఫూల్స్‌ను చేయొద్దని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.