సీఎం రేవంత్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ
- జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో కలిసిన జగ్గారెడ్డి
- దాదాపు ఇరవై నిమిషాలు ఇరువురి మధ్య చర్చ
- రాష్ట్ర రాజకీయాలపై చర్చించిన నేతలు
కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన నాయకులకు ఎమ్మెల్సీలు ఇవ్వాల్సి ఉందని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అదే సమయంలో త్వరలో లోక్ సభ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ, లోక్ సభ స్థానాలకు సంబంధించిన అంశాలపై మాట్లాడి ఉంటారనే చర్చ సాగుతోంది.