Venkatesh Daggubati: యాక్షన్ .. ఎమోషన్ .. రొమాన్స్ ప్రధానంగా సంక్రాంతి సినిమాల సందడి!

  • మాస్ యాక్షన్ మూవీగా 'గుంటూరు కారం'
  • ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ గా 'సైంధవ్'   
  • రొమాంటిక్ ఫీల్ తో కూడిన యాక్షన్ తో 'నా సామిరంగ'
  • డివోషనల్ టచ్ తో సాగే యాక్షన్ తో 'హను మాన్' 

Sankranthi Movies

సంక్రాంతికి కొత్త సినిమాలు సందడి చేయడమనేది ప్రతి యేటా ఉండేదే. అయితే ఈ సారి బలమైన స్టార్స్ రంగంలోకి దిగారు. 12వ తేదీన మహేశ్ బాబు 'గుంటూరు కారం' .. 13వ తేదీన వెంకటేశ్ 'సైంధవ్' .. 14వ తేదీన నాగార్జున 'నా సామిరంగ' థియేటర్లకు రానున్నాయి. ఈ ముగ్గురూ కూడా టాలీవుడ్ లో తిరుగులేని హీరోలే. ఈ స్థాయి సినిమాలు పోటీపడటం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి అని చెప్పాలేమో. వెంకటేశ్ .. నాగార్జున దాదాపు ఒకేసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి వాళ్లు వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే వారి సినిమాలు ఇలా ఒక రోజు గ్యాపుతో సంక్రాంతి బరిలో దిగడమనేది ఇప్పుడు మాత్రమే జరుగుతోంది. ఇక ఈ మూడు సినిమాల కంటెంట్ విభిన్నంగా ఉన్నప్పటికీ .. యాక్షన్ అనే అంశం ప్రధానంగా కనిపిస్తోంది. మహేశ్ బాబు సినిమా 'గుంటూరు కారం' మాస్ యాక్షన్ తో .. వెంకటేశ్ 'సైంధవ్' ఎమోషన్ తో కూడిన యాక్షన్ తో .. నాగార్జున 'నా సామిరంగ' రొమాన్స్ తో కూడిన యాక్షన్ తో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాయి. మిగతా అంశాల మాట ఎలా ఉన్నప్పటికీ, యాక్షన్ తో ఈ స్టార్ హీరోలు సందడి చేయనున్నారు. ఇక ఇదే సంక్రాంతికి వస్తున్న 'హను మాన్' డివోషనల్ టచ్ తో కూడిన యాక్షన్ తో ఆసక్తిని రేపుతుండటం విశేషం. 

More Telugu News