సిద్ధిపేటలో షాకింగ్ ఘటన.. హిజ్రాగా మారి వేధిస్తున్న భర్తను హత్య చేయించిన భార్య
- కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్న వ్యక్తితో కలిసి హత్యకు పథక రచన
- రూ.18 లక్షలు సుపారి ఇచ్చి హత్య చేయించిన నిందితురాలు వేదశ్రీ
- గతేడాది డిసెంబర్ 11న హత్య.. పోలీసులు రంగంలోకి దిగడంతో బయటపడ్డ నిజాలు
గత ఏడాది డిసెంబరు 11న నాసర్‌పురాలో తన ఇంట్లో ఒంటరిగా ఉన్న రోజాను హత్య చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నాగరాజుపల్లికి చెందిన రమేశ్ స్నేహితుడు ఇప్పల శేఖర్ రోజాతో మద్యం తాగించాడు. ఆ తర్వాత మరో ఇద్దరు వ్యక్తుల సాయంతో దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అప్పట్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదయింది. అయితే పోస్టుమార్టంలో హత్యగా నిర్ధారణ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయగా వేదశ్రీతో పాటు మరో ఐదుగురి పాత్ర ఉందని నిర్ధారించారు.
నిందితురాలు వేదశ్రీ సహా ముగ్గురిని సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు శనివారం రిమాండ్‌కు తరలించారు. వేదశ్రీ, బోయిని రమేశ్, ఇప్పల శేఖర్‌లను శనివారం అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. కాగా కుమార్తెను తనకు ఇవ్వాలంటూ భార్య వేదశ్రీని రోజా వేధించేవాడని, ఆమె ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న ప్రైవేటు పాఠశాల వద్దకు వెళ్లి ఇబ్బందులకు గురిచేసేవాడని పోలీసులు తెలిపారు. వేదశ్రీ కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్న బోయిని రమేశ్‌తో కలిసి హత్యకు పథక రచన చేసింది. ఇందుకు రూ.18 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని, రెండు విడతల్లో రూ.4.60 లక్షలు ముట్టజెప్పారని పోలీసులు తెలిపారు.