Kesineni Nani: చంద్రబాబు నిర్ణయాలను తప్పుపట్టను: కేశినేని నాని

  • లోక్‌సభ స్పీకర్ అపాయింట్‌మెంట్ కోరానన్న నాని
  • ఈ దఫా తర్వాత విశ్రాంతి తీసుకుంటానని రెండున్నరేళ్ల క్రితమే చెప్పానన్న విజయవాడ ఎంపీ
  • కార్యకర్తలతో చర్చించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడి
kesinani says he will meet lok sabha speaker

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన ఎంపీ కేశినేని నాని లోక్‌సభ స్పీకర్ అపాయింట్‌మెంట్  కోరినట్టు చెప్పారు. విజయవాడ ఎంపీ పదవికి రాజీనామా చేసి, రాజీనామా లేఖను స్పీకర్‌ను కలిసి అందజేస్తానని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా చింతలపాడులో మీడియాతో మాట్లాడుతూ ఈ దఫా తర్వాత విరామం తీసుకుంటానని రెండున్నరేళ్ల క్రితమే తన వాళ్లకి చెప్పానని గుర్తు చేశారు. పార్టీ, అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయాలను తాను తప్పుబట్టబోనని స్పష్టం చేశారు. కార్యకర్తలతో చర్చించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని నాని వివరించారు.

పార్టీకి తన అవసరం లేదని చంద్రబాబు భావించిన తర్వాత పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదంటూ ఈ ఉదయం నాని ఎక్స్ ద్వారా వెల్లడించారు. తొలుత లోక్‌సభకు ఆ తర్వాత పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

More Telugu News