పవన్ కల్యాణ్ కు మరో బహిరంగ లేఖ రాసిన హరిరామజోగయ్య
- ఉమ్మడి మేనిఫెస్టోకు పలు అంశాలను సూచించిన జోగయ్య
- వైసీపీ కంటే మెరుగైన సంక్షేమ పథకాలను అమలు చేయాలని సూచన
- వృద్ధులకు రూ. 4 వేల పెన్షన్ ఇవ్వాలన్న జోగయ్య
వైసీపీ ప్రభుత్వంలో నిత్యావసరాల ధరలు, ఇతర ఛార్జీలు భారీగా పెరిగాయని... వాటి నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రతి కుటుంబానికి రూ. 2 వేలు అందేలా చూడాలని సూచించారు. తెల్ల రేషన్ కార్డు ఆధారంగా కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది వృద్ధులు ఉన్నా... నెలకు రూ. 4 వేల పెన్షన్ అందించాలని అన్నారు. తెల్లకార్డు ఉన్న కుటుంబాల్లోని 18 ఏళ్లు దాటిన విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా ఎలక్ట్రికల్ స్కూటీలను ఇవ్వాలని సలహా ఇచ్చారు. అలాగే విద్యుత్ బిల్లులపై 20 శాతం సబ్సిడీ ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.