Devil: 4 రోజుల్లో 'డెవిల్' రాబట్టిన వసూళ్లు ఇవే!

  • డిసెంబర్ 29న వచ్చిన 'డెవిల్'
  • 1945 నేపథ్యంలో నడిచే కథ 
  • బారీ ఓపెనింగ్స్ తో మొదలైన ప్రయాణం 
  • ప్రపంచవ్యాప్తంగా నిన్నటితో 22.59 కోట్ల గ్రాస్  

Devil movie update

కల్యాణ్ రామ్ నుంచి డిసెంబర్ 29వ తేదీన 'డెవిల్' సినిమా వచ్చింది. అభిషేక్ నామా బ్యానర్ నుంచి వచ్చిన ఈ సినిమా, 1945 నేపథ్యంలో తెరకెక్కింది. పోస్టర్స్ నుంచే ఈ సినిమా అందరిలో కుతూహలాన్ని పెంచగలిగింది. సంయుక్త మీనన్ కథానాయికగా నటించిన ఈ సినిమా, పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. భారీ ఓపెవింగ్స్ తో ఈ సినిమా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.

నిన్నటితో ఈ సినిమా విడుదలై 4 రోజులు అవుతోంది. ఈ 4 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 22.59 కోట్ల గ్రాస్ ను రాబట్టగలిగింది. ఈ విషయాన్ని ఈ సినిమా టీమ్ అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. నిన్న కూడా సెలవు రోజు కావడం వసూళ్ల పరంగా ఈ సినిమాకి కలిసొచ్చిందని చెప్పచ్చు. 

ఫ్లాష్ బ్యాక్ లో భాగంగా 1945 కాలాన్ని కొంతసేపు చూపించడం సాధ్యమే అనుకోవచ్చు. కానీ ఈ కథ అంతా కూడా ఆ కాలంలోనే నడుస్తుంది. దీనిని బట్టి కంటెంట్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలనేది అర్థం చేసుకోవచ్చు. కల్యాణ్ రామ్ కెరియర్ లో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రాలలో ఒకటిగా ఈ సినిమాను గురించి కూడా చెప్పుకోవచ్చు.

More Telugu News