నేడు ఇడుపులపాయకు వెళ్తున్న వైఎస్ షర్మిల
- షర్మిల ఇంట్లో ప్రారంభమైన పెళ్లి సందడి
- ప్రియతో షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లి
- ఫిబ్రవరి 17న వివాహ వేడుక
ఈ నేపథ్యంలో కాబోయే వధూవరులు, కుటుంబ సభ్యులతో కలిసి షర్మిల ఈరోజు ఇడుపులపాయకు వెళ్తున్నారు. వివాహ ఆహ్వాన తొలి పత్రికను తన తండ్రి సమాధి వద్ద ఉంచి ఆయన ఆశీస్సులు తీసుకోనున్నారు. మరోవైపు, అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన రాజారెడ్డి, ప్రియ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారు. ఇరు కుటుంబాల అంగీకారంతో వీరి వివాహం జరగనుంది.