షర్మిల ఎంట్రీ అయ్యారు... ఏపీ కాంగ్రెస్ కార్యకర్తలకు శుభవార్త: వి.హనుమంత రావు
- ఏపీ రాజకీయాల్లో షర్మిల రాణిస్తారన్న వీహెచ్
- ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే ఫైట్ చేయాలని సూచన
- ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవశ్యకత ఉందని వ్యాఖ్య
తెలంగాణలో కాంగ్రెస్ బలపడి అధికారంలోకి వచ్చిందని... ఏపీలోనూ మన పార్టీ బలపడాల్సిన అవశ్యకత ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని వారు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని సూచించారు. ఏపీ కాంగ్రెస్ నేతలు... షర్మిలను అక్కడకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సోనియా గాంధీ ఆరు గ్యారెంటీల పథకం ప్రకటనతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించినట్లు తెలిపారు.