‘నవరత్నాలు + మేనిఫెస్టో + జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో 85 శాతం ఫెయిల్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన టీడీపీ నేతలు
- సీఎం జగన్ పై తీవ్ర ఆరోపణలతో కూడిన పుస్తకం
- మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో పుస్తకావిష్కరణ
- హాజరైన అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ అగ్రనేతలు
ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, నక్కా ఆనంద్ బాబు, టీ.డీ. జనార్దన్, పరుచూరి అశోక్ బాబు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మొహమ్మద్ నసీర్ అహ్మద్, ధారునాయక్ తదితరులు పాల్గొన్నారు.
పచ్చి అబద్ధాలకోరు జగన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు 730 అని, అందులో అమలు చేసింది కేవలం 109 అని టీడీపీ నేతలు పేర్కొన్నారు. అంటే 15 శాతం మాత్రమే అమలు చేశారని... కానీ, 99.5 శాతం హామీలు అమలు చేశానని చెప్పుకోవడం పచ్చి అబద్ధాలు, నిలువెత్తు మోసాలకు ప్రతిరూపమైన జగన్ రెడ్డికే చెల్లిందని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.