నన్ను మేడమ్ అని పిలువవద్దు: అధికారులకు మంత్రి సీతక్క సూచన
- తనను సీతక్క అనే పిలవాలని సూచించిన మంత్రి
- మేడమ్ అంటే దూరం అవుతుందన్న సీతక్క
- సీతక్క అంటే... మీ చెల్లిగా.. అక్కగా కలిసిపోతామని వ్యాఖ్య
పదవులు ఎవరికీ శాశ్వతం కాదని... విలువలు, మంచి పనులే మనకు శాశ్వతమన్నారు. కాంగ్రెస్ పాలన అంటే గడీల పాలన కాదని.. గల్లీ బిడ్డల పాలన అని పేర్కొన్నారు. ప్రజలకు ఎప్పుడు.. ఏం అవసరమున్నా తమతో చెప్పుకోవచ్చునని ప్రజలకు ధైర్యం చెప్పారు. కాగా, అదిలాబాద్ జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా... ఆమె జామినిలో గురువారం ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు.