విజయకాంత్ సినిమాలు బాల్యం నుంచే నా జీవితంలో భాగమయ్యాయి: మంచు విష్ణు

  • ఈ ఉదయం కన్నుమూసిన విజయకాంత్
  • విజయకాంత్ మృతికి విష్ణు సంతాపం
  • వీడ్కోలు కెప్టెన్ అంటూ ఎక్స్ చేసిన నటుడు
ప్రముఖ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ మృతికి టాలీవుడ్ నటుడు మంచు విష్ణు సంతాపం తెలిపారు. కెప్టెన్‌గా చిరపరిచితుడైన విజయకాంత్ మృతి బాధించిందన్నారు. తన బాల్యం నుంచే ఆయన సినిమాలు తన జీవితంలో భాగంగా మారాయని గుర్తు చేసుకున్నారు. ఆయన పంచిన జ్ఞానాన్ని తానెప్పుడూ గౌరవిస్తానని తెలిపారు. తామెప్పుడు కలిసినా ఇష్టంగా మాట్లాడేవారని, చిత్ర పరిశ్రమలో నిజమైన నాయకుడు ఆయనేనని ప్రశంసించారు. ‘వీడ్కోలు కెప్టెన్’ అని విష్ణు ఎక్స్ చేశారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయకాంత్ ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన మరణవార్త కోలీవుడ్, టాలీవుడ్ సహా అన్ని చిత్ర పరిశ్రమలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన కుటుంబానికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.


More Telugu News

Manchu Vishnu Vijayakanth Kollywood