ఎల్గార్ సెంచరీ... టీమిండియాపై దక్షిణాఫ్రికాకు స్వల్ప ఆధిక్యం
- సెంచురియన్ లో తొలి టెస్టు
- టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 245 ఆలౌట్
- రెండో రోజు ఆట చివరికి 5 వికెట్లకు 256 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా
ఎల్గార్ కు మిడిలార్డర్ లో అరంగేట్రం కుర్రాడు డేవిడ్ బెడింగ్ హామ్ నుంచి చక్కని సహకారం లభించింది. బెడింగ్ హామ్ ఆడుతున్న తొలి టెస్టులోనే అర్ధసెంచరీ సాధించి ఆకట్టుకున్నాడు. బెడింగ్ హామ్ 87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 56 పరుగులు చేశాడు.
ఎల్గార్, బెడింగ్ హామ్ సెంచరీ భాగస్వామ్యంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ను నడిపించారు. అయితే ఈ జోడీని సిరాజ్ ఓ చక్కని ఇన్ స్వింగర్ తో విడదీశాడు. అప్పటికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోరు 4 వికెట్లకు 244 పరుగులు. ఆ తర్వాత కాసేపటికే ప్రసిద్ధ్ కృష్ణ విజృంభించి సఫారీ వికెట్ కీపర్ కైల్ వెర్రీన్ (4) ను అవుట్ చేశాడు. దాంతో దక్షిణాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా 2, సిరాజ్ 2, ప్రసిద్ధ్ 1 వికెట్ తీశారు.
ఇక, రెండో రోజు ఆట చివరికి ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరు 66 ఓవర్లలో 5 వికెట్లకు 256 పరుగులు. ఎల్గార్ కు జతగా మార్కో యన్సెన్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. టీమిండియాపై ఆ జట్టు ఆధిక్యం 11 పరుగులు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 245 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.