కేటీఆర్ తన లక్ష కోట్ల సంపాదన నుంచి ఆమెకు లక్ష ఇచ్చాడు: రేవంత్ రెడ్డి కౌంటర్
- ప్రజావాణికి వచ్చిన మహిళకు లక్ష రూపాయలు ఇచ్చిన కేటీఆర్
- ప్రజావాణి లక్ష్యం నెరవేరినట్లేనన్న రేవంత్ రెడ్డి
- లక్ష కోట్ల నుంచి రూ.1 లక్ష ఇస్తే నష్టమేమీ లేదన్న ముఖ్యమంత్రి
పదేళ్లపాటు కేటీఆర్, హరీశ్ రావులు తిన్నది ప్రజల రక్తం కూడు అని ఆరోపించారు. ప్రజల రక్తమాంసాలతో రూ.1 లక్ష కోట్లు సంపాదించారన్నారు. అసెంబ్లీలో కూడా బావాబావమరుదులు తప్ప మిగతా వారికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. అసెంబ్లీలో చెప్పుకోవడానికి వారికి ఏ అంశమూ లేదని, అందుకే బయట చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ అంతా ఖాళీ చేసి పోయింది
బీఆర్ఎస్ తన పదేళ్ల పాలనలో తెలంగాణను అంతా ఖాళీ చేసి పోయిందని రేవంత్ రెడ్డి అన్నారు. మేమేదో లంకెబిందెలు ఉన్నాయని భావిస్తే... వచ్చి చూస్తే ఖాళీ కుండలు కనిపించాయని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అంతా ఊడిచిపెట్టి పోయారని.. ఈ పరిస్థితి నుంచి తేరుకొని ముందుకు సాగుతామన్నారు. అందుకే తాము కేంద్రం వద్దకు వెళ్లినట్లు చెప్పారు. తెలంగాణకు సంబంధించి ఎక్కడి నుంచి రావాలో అవన్నీ తెస్తామన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా తెచ్చుకుంటామన్నారు.