అత్తాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. సురక్షిత ప్రాంతాలకు స్థానికుల తరలింపు
- కట్టెల గోడౌన్‌లో అంటుకున్న మంటలు
- పక్కనే ఉన్న స్క్రాప్ దుకాణానికీ వ్యాపించిన వైనం
- మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
- ప్రమాదానికి గల కారణాలపై పోలీసుల ఆరా
ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. మరోవైపు, స్థానికులను పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రమాదంలో ఆస్తినష్టం భారీగా జరిగిందని అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.