తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం: కోమటిరెడ్డి
- బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ విధ్వంసానికి గురైందని ఆరోపణ
- తాము అధికారంలోకి వచ్చాక గాడిన పెడుతున్నామన్న కోమటిరెడ్డి
- ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ నాయకులు కోట్లాది రూపాయలు దోచుకున్నారని విమర్శ
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేశానని చెప్పుకున్న కేసీఆర్ కనీసం ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదన్నారు. కనీసం కాలువలు తవ్వలేదన్నారు. మేడిగడ్డ కుంగిపోవటం తెలంగాణకే తలవంపులు అని దుయ్యబట్టారు. మేడిగడ్డ కుంగుబాటు వెనుక విధ్వంసక చర్య ఉందని కల్లబొల్లి కబుర్లు చెప్పారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ముందుకు సాగుతోందన్నారు. పేదవాడి ఆత్మగౌరవం నిలబెడతామని, నిజాయతీతో కూడిన పాలన ప్రజలకు అందిస్తామన్నారు.