తెలంగాణలో కొవిడ్ జేఎన్.1 సబ్ వేరియంట్ కేసులు నమోదు కాలేదు: వైద్య ఆరోగ్య శాఖ
- ఆందోళన అవసరం లేదు... కానీ అప్రమత్తంగా ఉండాలని సూచన
- గడిచిన 24 గంటల్లో 989 మందికి పరీక్షలు నిర్వహించగా 10 పాజిటివ్ కేసుల నమోదు
- కొత్తగా నమోదైన కేసుల్లో 9 హైదరాబాద్, 1 కరీంనగర్‌లో ఉన్నట్లు వెల్లడి
మరోవైపు, గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 989 మందికి పరీక్షలు చేయగా 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ లో 9, కరీంనగర్లో 1 ఉన్నాయి. ఒక్కరోజు వ్యవధిలో ఈ మహమ్మారి నుంచి ఒకరు కోలుకోగా... మరో 55 మంది ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. మరో పన్నెండు మంది నివేదికలు రావాల్సి ఉందని తెలిపింది.