Uttar Pradesh: యూట్యూబ్ వీడియో చూసి 11 ఏళ్ల బాలుడి ఆత్మహత్య

11 Year Old Dies By Suicide In UP After Watching Ways To Die Video Online
షార్ట్స్‌లో చూడండి
ఉత్తరప్రదేశ్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎలా చనిపోవాలి అనే వీడియో చూసి ఓ బాలుడు చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. హమీర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిఖిల్ సాహూ అనే ఆరో తరగతి విద్యార్థి గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వేస్ టూ డై అనే వీడియో చూసి ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడిది ఆత్మహత్య అన్న విషయం పోస్ట్‌మార్టంలో తేలిందని పోలీసులు తెలిపారు. అతడి నిర్ణయం వెనక కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు.
Go Back to Shorts
Uttar Pradesh
Crime News

More Telugu News