ఎమ్మెల్యేల కొనుగోలు... శ్రీనివాస్ గౌడ్‌పై హత్యాయత్నం కేసులపై దర్యాఫ్తు కొనసాగుతోంది: సైబరాబాద్ సీపీ
- సైబరాబద్ వార్షిక నేర నివేదికను విడుదల చేసిన సీపీ అవినాశ్ మహంతి
- 2022తో పోలిస్తే 2023లో నేరాలు పెరిగినట్లు వెల్లడి
- మహిళలపై నేరాలు పెరిగాయని... అత్యాచారాలు తగ్గాయని వెల్లడి
కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ కేసులు 2022లో 4,850 ఉంటే... 2023లో 5,342 కేసులు నమోదయ్యాయని, డ్రగ్స్ కేసులు గత ఏడాది 277 కాగా, ఈ ఏడాది 567గా ఉన్నాయన్నారు. ఆర్థిక, స్థిరాస్తి కేసులు కూడా పెరిగినట్లు చెప్పారు. బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, ఈ సంవత్సరం మహిళలపై నేరాలు పెరిగినట్లు చెప్పారు. అత్యాచారాలు తగ్గినట్లు తెలిపారు. 2022లో 316 అత్యాచారాలు నమోదయితే ఈసారి 259 నమోదైనట్లు వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు, హత్యలు, దొంగతనాలు పెరిగాయన్నారు. ఈ ఏడాది 52 వేలకు పైగా డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయన్నారు.
నూతన సంవత్సర వేడుకలపై స్పందిస్తూ... ఈ వేడుకలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. లేదంటే కఠిన చర్యలు తప్పవన్నారు. నూతన సంవత్సర వేడుకల సమయంలో తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు.